: పోలవరంపై ఆర్డినెన్స్ తేవడం తప్పే: అసదుద్దీన్
పోలవరం ముంపు మండలాలపై ఆర్డినెన్స్ తేవడం సరికాదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, త్వరలో పార్లమెంటు సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఆర్డినెన్స్ తేవడంలో ఎన్డీయే తొందరపాటుగా వ్యవహరించిందని అన్నారు. పార్లమెంటు సమావేశాల తరువాత ఆర్డినెన్స్ పాస్ చేసి ఉంటే బాగుండేదని ఆయన తెలిపారు.