: జూన్ 4 నుంచి 11వరకే పార్లమెంటు సమావేశాలు: వెంకయ్యనాయుడు
ముందు చెప్పినట్టు కాకుండా 16వ పార్లమెంటు తొలి సమావేశాలు జూన్ 4 నుంచి 11 వరకే జరగనున్నాయి. ఈ మేరకు కేబినెట్ భేటీలో నిర్ణయించినట్లు పట్టణాభివృద్ధి శాఖ, పార్లమెంటు వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడు మీడియా సమావేశంలో తెలిపారు. 4, 5 తేదీల్లో కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుందని, 6వ తేదీన స్పీకర్ ను ఎన్నుకోవడం జరుగుతుందని వివరించారు. ఇక 9వ తేదీన ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తారని వెల్లడించారు. అదే రోజు నుంచి రాజ్యసభ ప్రారంభమవనుందని చెప్పారు. లోక్ సభలో సీనియర్ ఎంపీల్లో ఒకరైన కమల్ నాథ్ ప్రొటెం స్పీకర్ గా వ్యవహరిస్తారని చెప్పారు. సమావేశాల చివరి రోజున ప్రధానమంత్రి మాట్లాడతారని వెంకయ్య పేర్కొన్నారు.