: చంద్రబాబు చేతిలో మంద కృష్ణ కీలుబొమ్మ: ఎమ్మెల్యే రాజయ్య
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగపై టీడీపీ ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో ఆయనో కీలుబొమ్మ అని విమర్శించారు. దళిత ఎమ్మెల్యేలు దొరల తొత్తులు అన్న మంద కృష్ణ, దళిత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, చంద్రబాబు ఎజెండాను అమలు చేస్తున్నారని... అందుకే వర్ధన్నపేటలో మాదిగలు కృష్ణను ఘోరంగా ఓడించారని ఎద్దేవా చేశారు.