: ఇవి ఆర్టీసీ సిబ్బంది విరాళాలతో కొన్న బస్సులు!


ఆర్టీసీలో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ సంస్థ కోసం ఒక రోజు వేతనాన్ని సాయంగా అందించారు. అలా పోగైన రూ. 4 కోట్ల 50 లక్షలతో సంస్థ 12 పల్లె వెలుగు బస్సులను కొనుగోలు చేసింది. ఆర్టీసీని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కించే లక్ష్యంతో ఎండీ పూర్ణచందర్ రావు పనిచేస్తున్నారు. ఆయన ఉద్యోగులను, కార్మికులను ఉత్తేజపరచి ఈ ఘనత సాధించారు. మే నెలకు సంబంధించిన ఒక రోజు వేతనం అందించడంతో కొనుగోలు చేసిన 12 బస్సుల్లో ఆరింటిని ఆంధ్రప్రదేశ్ కు, మరో ఆరింటిని తెలంగాణకు కేటాయించారు. ప్రతి రీజియన్ కు ఒకటి చొప్పున కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ బస్సులపై ‘ఆర్టీసీ సిబ్బంది విరాళాలతో కొన్న బస్సు’ అని రాశారు.

  • Loading...

More Telugu News