: కేరళ అసెంబ్లీ ముందు కురియన్ కు వ్యతిరేకంగా నిరసన
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పీజె కురియన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కేరళ అసెంబ్లీ ఎదుట ఆందోళనకారులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యాన్లను ఉపయోగించారు.
1996లో ఓ యువతిపై 42 మంది అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఆయన కూడా ఓ వ్యక్తిగా పేర్కొంటూ బాధితురాలు గతంలో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడంతో సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేరళ అసెంబ్లీలో కురియన్ అంశంపై చర్చించాలంటూ రెండు రోజుల నుంచి ఎల్డీఎఫ్ ఆధ్వర్యంలోని సీపీఐ డిమాండు చేస్తోంది. వాస్తవానికి ఈ కేసులో కురియన్ ను నిర్దోషిగా 2007లో సుప్రీం కోర్టు ప్రకటించింది.