: చంద్రబాబు అర్థాంగి స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు ఎండనకా వాననకా వస్తున్నా మీకోసమంటూ రాష్ట్ర వ్యాప్తంగా నడిచేస్తుంటే, భర్తకు ఊడతాభక్తిగా తనవంతు సాయమందిస్తున్నారు నారా భువనేశ్వరి. పార్టీ అధినేత చేయాల్సిన కార్యక్రమాలు తన భుజాన వేసుకుని, నేను సైతం అంటూ ముందుకు వస్తున్నారు.
ఇదే కోవలో.. విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ఇటీవల తెలుగుదేశం పార్టీ నేతలు చేపట్టిన నిరాహారదీక్షలను భువనేశ్వరి నిమ్మరసం ఇచ్చి విరమింపజేసి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వచ్చి విద్యుత్ ఛార్జీల పెంపుపై చేపట్టిన సంతకాల ఉద్యమంలో పాల్గొన్నారు.
ఇదిలాఉండగా, టీడీపీ అధినేత చంద్రబాబు తన పాదయాత్రను ఈనెల 27న విశాఖపట్నంలో భారీగా నిర్వహించే బహిరంగసభతో ముగిస్తారు. ఆ తర్వాత కూడా బాబు సతీమణి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారో లేదో!