: చెన్నై ఎక్స్ ప్రెస్ లో దోపిడీ
చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చెన్నై ఎక్స్ ప్రెస్ లో కొందరు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత గుంటూరు జిల్లా పిడుగురాళ్ల వద్ద చైన్ లాగి రైలును ఆపారు. పలు స్లీపర్ కోచ్ లలోని ప్రయాణికుల నుంచి ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. దీనిపై ప్రయాణికులు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకోగానే పోలీసులకు ఫిర్యాదు చేశారు.