: సీమాంధ్ర రాజధాని నిర్మాణానికి ఓ కూలీగా పనిచేస్తా: చంద్రబాబు


సీమాంధ్ర రాజధాని నిర్మాణానికి నెంబర్ వన్ కూలీగా పనిచేస్తానని చంద్రబాబు చెప్పారు. మహానాడు ముగింపు ఉపన్యాసంలో ఆయన మాట్లాడుతూ... తాను ఓ కూలీగానే పనిచేస్తానని చెప్పారు. అవినీతి లేని సమాజం కోసం పనిచేస్తానని, పేదరిక నిర్మూలన కోసం రేయింబవళ్లు పనిచేస్తానని అన్నారు. ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని బాబు చెప్పారు. సమైక్యాంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన వారిపై పెట్టిన కేసులను ఎత్తివేస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో పెట్టిన కేసులను ఎత్తివేసేవరకు టీడీపీ పోరాడుతుందని అన్నారు. భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, మానసికంగా అందరం కలిసే ఉందామని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News