: ఇన్ఫోసిస్ కు అధ్యక్షుడు బీజీ శ్రీనివాస్ రాజీనామా
ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ నుంచి అధ్యక్షుడు, బోర్డులో ప్రధాన సభ్యుడైన బీజీ శ్రీనివాస్ వైదొలగారు. ఈ మేరకు ఇన్ఫోసిస్ లో పదకొండవ ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ అయిన శ్రీనివాస్ రాజీనామా చేసినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. జూన్ పది నుంచి ఈ రాజీనామా అమల్లోకి వస్తుందని చెప్పింది. తన పదవీకాలంలో సంస్థలో 'ఎంటర్ ప్రైజెస్ సొల్యూషన్స్ యూనిట్' లో ప్రధాన పాత్ర పోషించినట్లు ఇన్ఫో వెల్లడించింది.