: అమెరికాలో 'బాద్ షా' బాదుషాలా మారిపోయింది...!


అవును.. చూడబోతే అలాగే కనిపిస్తోంది.. ఎన్టీఆర్-కాజల్-శ్రీను వైట్ల తాజా చిత్రం బాద్ షా అమెరికా బాక్సాఫీస్ వద్ద హాట్ స్వీటులా తయారైంది. ఈ చిత్రం అమెరికాలో ప్రస్తుతం ప్రదర్శింపబడుతోన్న సినిమాల్లో వసూళ్ల పరంగా 10వస్థానం సాధించింది. ఏప్రిల్ 4వ తేదీన వందకుపైగా థియేటర్లలో ప్రీమియర్ షో లతో రిలీజైన ఈ సినిమా ఇప్పటివరకూ 234,686 అమెరికా డాలర్లు వసూలు చేసింది. వీకెండ్ కావడంతో వసూళ్లు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికాలో ఇంతకుముందు రిలీజైన ఎన్టీఆర్ చిత్రాలేవీ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు.

ఇటు, టాలీవుడ్ లోనూ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాని భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన సంగతి మనకు తెలుసు.

  • Loading...

More Telugu News