: రాహుల్ గాంధీ ఓ జోకర్... కాంగ్రెస్ నేత ధ్వజం
రాహుల్ గాంధీపై కేరళ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత టీహెచ్ ముస్తాఫా ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ఓ జోకర్ అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తనంత తానుగా పదవుల నుంచి తప్పుకోవాలని, లేనిపక్షంలో ఆయనను బలవంతంగా పదవుల నుంచి దించివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన జోకర్ వ్యవహారం వల్లే కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో దిక్కూ, మొక్కు లేకుండా పోయిందని మండిపడ్డారు.
పార్టీకి ప్రియాంక గాంధీని అధ్యక్షురాలిగా చేస్తే తప్ప కాంగ్రెస్ బతికి బట్టకట్టదని ఆయన అభిప్రాయపడ్డారు. భజనపరుల వల్లే కాంగ్రెస్ పార్టీ దెబ్బతిందని ఆయన స్పష్టం చేశారు. భజనపరుల్లో ఏకే ఆంటోనీ కూడా చేరారని ఆయన ఎద్దేవా చేశారు.