: పోలవరం ముంపు గ్రామాల ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం
ఖమ్మం జిల్లా పోలవరంలోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ కేంద్రం రూపొందించిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆర్డినెన్స్ ఫైలుపై ఆయన సంతకం చేశారు. ఇప్పటికే దీనిపై టీఆర్ఎస్ తీవ్ర వ్యతిరేకత తెలుపుతుండగా, ఎన్డీఏ ప్రభుత్వం చడీ చప్పుడు లేకుండా నిన్నటి (మంగళవారం) కేబినెట్ భేటీలో ఆమోదించడం, ఆ తర్వాత రాష్ట్రపతికి పంపడం గమనార్హం. ఈ క్రమంలో సాయంత్రం 6.30 గంటలకు గవర్నర్ నరసింహన్ ను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలవనున్నారు.