: కేంద్ర మంత్రి వర్గ సమావేశానికి ద్వితీయ విఘ్నం


కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత తొలిసారిగా కేంద్ర మంత్రి వర్గం నిన్న సాయంత్రం రెండు గంటలపాటు సుదీర్ఘంగా సమావేశం ఏర్పాటు చేసి నల్లధనంపై చర్చించింది. రేపు సమావేశం అవుదామంటూ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ రెండవ సమావేశానికి ద్వితీయ విఘ్నం ఎదురైంది. ఈ రోజు సాయంత్రం జరగాల్సిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం రేపటికి వాయిదా పడింది. రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో లోక్ సభ తొలి సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలతో పాటు, పలు కీలక విషయాలను కూడా చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News