: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల తెలంగాణ వారికే నష్టం: చంద్రబాబు


సీమాంద్ర, తెలంగాణ ప్రాంతాలను అభివృద్ధి చేసింది తామేనని టీడీపీ అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. మహానాడులో ఆయన మాట్లాడుతూ... హైదరాబాదును అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కష్టపడ్డానని, ఫైళ్లను చంకలో పెట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తాను చేసిన కృషి వల్లే తెలంగాణలో మిగులు బడ్జెట్ వచ్చిందని ఆయన చెప్పారు.

వార్ రూమ్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని మళ్లీ అడుగుతున్నానని బాబు అన్నారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల తెలంగాణ వారే నష్టపోతారని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసే విషయంలో పోటీ పడదామని ఆయన కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. పోలవరంపై అనవసర అపోహలు సృష్టించవద్దని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News