: ఎన్నికల్లో ఓటమికి మాదే బాధ్యత: షబ్బీర్ అలీ
ఎన్నికల్లో ఓటమికి తమదే బాధ్యత అని టీ్-కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. ఓటమికి గల కారణాలను సమీక్షించుకుని, తమ లోపాలను సరిదిద్దుకుంటామని ఆయన అన్నారు. తెలంగాణను తెచ్చింది తామే అన్న నినాదాన్ని సరిగా ప్రజల్లోకి తీసుకువెళ్లలేక పోయామని ఆయన చెప్పారు. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని షబ్బీర్ అలీ అన్నారు.