: బీజేపీ అధ్యక్ష పదవి రేసులోకి అమిత్ షా


సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి అధిక లోక్ సభ స్థానాలు రావడానికి కృషి చేసిన అమిత్ షా పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకూ ఈ పదవికి హిమాచల్ ప్రదేశ్ కు చెందిన జేపీ నద్దా పేరు ప్రధానంగా పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు నద్దాతోపాటు అమిత్ షా, ఓమ్ మాథుర్ పేర్లు కూడా అధ్యక్ష పదవికి వినిపిస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు రాజ్ నాథ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినందున ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న నియమానికి కట్టుబడి ఆయన రాజీనామా చేయనున్నారు.

తన స్థానంలో నద్దాను బీజేపీ అధ్యక్షుడిని చేయాలన్నది రాజ్ నాథ్ మనోగతం. అయితే, హిమాచల్ ప్రదేశ్ లో స్థానిక నేతలను కలుపుకుని పోలేకపోవడం ఆయనకు మైనస్. అమిత్ షా పనితీరు ఆయనకు ప్లస్. పైగా ఆయన మోడీకి చాలా సన్నిహితులు. అయితే, గుజరాత్ హోం మంత్రిగా ఉన్న సమయంలో నకిలీ ఎన్ కౌంటర్లు జరపించారనే అపవాదును ఆయన ఎదుర్కొంటున్నారు. పైగా ఈయన కూడా గుజరాత్ రాష్ట్రవాసే. అమిత్ షాను ఎంపిక చేస్తే ప్రధాని, పార్టీ అధ్యక్ష పదవులు రెండూ గుజరాత్ కే వెళ్లినట్లు అవుతుంది. ఓం మాథుర్ రాజస్థాన్ కు చెందిన ప్రముఖ నేత. మోడీకి సన్నిహితుడు.

  • Loading...

More Telugu News