: ప్రొటెం స్పీకర్ గా కమల్ నాథ్
లోక్ సభలో అందరి కంటే సీనియర్ సభ్యుడైన కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి కమల్ నాథ్ 16వ లోక్ సభలో ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో జూన్ నుంచి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఆయన అధికారికంగా నిర్వహిస్తారు. కమల్ ఆధ్వర్యంలోనే కొత్తగా ఎంపికైన ఎంపీలు సభలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ సమయంలోనే కొత్త లోక్ సభ స్పీకర్ ను ఎన్నుకోనున్నారు.