: మహానాడును సంక్రాంతి పండుగలా మార్చింది కార్యకర్తలే: లోకేష్
తనకు లోకేష్ అని పేరు పెట్టి ఆశీర్వదించిన తాతగారు ఎన్టీఆర్ కు నీరాజనాలు అంటూ టీడీపీ యువనేత లోకేష్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గండిపేటలో జరుగుతోన్న మహానాడులో టీడీపీ యువనేత లోకేష్ మాట్లాడుతూ... 33 సంవత్సరాలుగా తెలుగుదేశం జెండా మోస్తూ, మడమ తిప్పకుండా పనిచేస్తున్న కార్యకర్తలందరికీ శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తున్నానని అన్నారు. మహానాడును సంక్రాంతి పండుగలా మార్చింది కార్యకర్తలేనని అన్నారు. చిత్తశుద్ధి కల కార్యకర్తలే టీడీపీకి బలమని ఆయన పునరుద్ఘాటించారు. కార్యకర్తలను సొంత పిల్లల్లా చంద్రబాబు చూసుకుంటారని, కార్యకర్తల పిల్లలకు ఉచితంగా విద్య టీడీపీ అందిస్తోందన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా చంద్రబాబు ఆదుకుంటారని ఆయన చెప్పారు.