: సీమాంధ్రలో జంట నగరాలుగా విజయవాడ-గుంటూరు: వెంకయ్యనాయుడు


తెలంగాణలోని హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలకు దీటుగా సీమాంధ్రలో విజయవాడ-గుంటూరులను కూడా జంట నగరాలుగా అభివృద్ధి చేస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంకయ్య నాయుడు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరితో పాటు విశాఖపట్నంలో కూడా మెట్రో రైలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన ఢిల్లీలో చెప్పారు. టౌన్ షిప్ ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, గృహ నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News