: తెలుగుజాతి ముద్దుబిడ్డ ఎన్టీఆర్: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి


తెలుగుజాతి ముద్దుబిడ్డ ఎన్టీఆర్ అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మహానాడు వేదికపై సోమిరెడ్డి మాట్లాడుతూ... తామంతా రాజకీయాల్లో ఉన్నామంటే దానికి కారణం ఎన్టీఆరేనని అన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్... సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉండాలో దేశానికి చాటి చెప్పారని అన్నారు. ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. రాష్ట్రం అరాచక శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తమ నాయకుడు చంద్రబాబు కాపాడారని సోమిరెడ్డి చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలోనే తాము ఆంద్రప్రదేశ్ లో విజయం సాధించామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘ఎన్టీఆర్ అమర్ రహే’ అంటూ సోమిరెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.

  • Loading...

More Telugu News