: హెచ్1బి వీసా దక్కాలంటే అదృష్టం ఉండాల్సిందే
ముందుగా ఊహించినట్లే హెచ్1బి వీసాలకు అపూర్వ స్పందన లభించింది. ఐదు రోజులలోనే అప్లికేషన్ల స్వీకరణ కార్యక్రమం ముగిసిపోయింది. ఇక దరఖాస్తులను స్వీకరించబోమని అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం(యుఎస్ సిఐఎస్) అధికారికంగా ప్రకటించింది. సెనేట్ అనుమతించిన 65వేల వీసాల కోటాకు మించి దరఖాస్తులు వచ్చాయని తెలిపింది. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 1న ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఇక, అమెరికాలో ఉన్నత విద్య చదివే వారికోసం జారీ చేయనున్న 20వేల హెచ్1బి వీసాలకు కూడా అంతకుమించిన దరఖాస్తులు వచ్చాయి. దీంతో కంప్యూటర్ లాఠరీ ద్వారా వచ్చిన దరఖాస్తుల్లోంచి విజేతలను ఎంపిక చేస్తామని యుఎస్ సిఐఎస్ వెల్లడించింది.