: తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం: బాలకృష్ణ
టీడీపీ తెలంగాణలోనూ అధికారంలోకి వస్తుందని నటుడు బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. మహానాడులో ఆయన మాట్లాడుతూ... ఎవరైనా నన్ను నీవెవరని అడిగితే భారతీయుడినని చెబుతానన్నారు. మళ్లీ అడిగితే తెలుగువాడినని, మళ్లీ అడిగితే, నందమూరి తారకరామారావు కుమారుడినని, అన్న ఎన్టీఆర్ అభిమానినని చెబుతానంటూ టీడీపీ శ్రేణులను ఉత్సాహపరిచారు. ఎన్టీఆర్ 91వ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడ్డానికే ఎన్టీఆర్ పార్టీ పెట్టారని, ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని చెప్పారు. తర్వాత పార్టీ బాధ్యతలను భుజానికెత్తుకున్న చంద్రబాబునాయడు గారు కూడా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు.