: ఎన్టీఆర్ కు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ నివాళి
తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 91వ జయంతి సందర్భంగా ఈ రోజు ఉదయం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ లో కుటుంబసభ్యులు ఆయనకు నివాళులర్పించారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, కల్యాణరామ్ లు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, శ్రేణులు కూడా ఘనంగా నివాళులర్పించారు. హరికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నందమూరి తారకరామారావు పాదాలు మరోసారి ఈ నేలను తాకాలని ఆయన మనవడు, నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆశించారు.