: భారత్ ఆర్ధిక మూలాలు దెబ్బతీయండి: కొత్త ఉగ్రవాద సంస్థ
ప్రపంచం మొత్తం అసహ్యించుకుంటున్నా ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గడం లేదు సరికదా కొత్త రూపుతో పుట్టుకొస్తున్నాయి. తాజాగా అల్ ఖైదాకు అనుబంధంగా కొత్త ఉగ్రవాద సంస్థ పుట్టింది. అన్సార్ ఉద్ తాహీద్ పేరు పెట్టుకున్న ఈ ఉగ్రవాద సంస్థ అఫ్ఘనిస్తాన్ లో భారత దౌత్య కార్యాలయంపై దాడి జరగడానికి రెండు రోజుల ముందు ఇంటర్నెట్ లో ఓ వీడియో సందేశం విడుదల చేసింది. భారతదేశ ఆర్ధిక మూలాలు దెబ్బతీయాలని ఉగ్రవాద సంస్థలకు పిలుపునిచ్చింది. దీంతో భారత్ లోని ఇంటెలిజెన్స్ విభాగాలు అప్రమత్తమయ్యాయి. దీని కదలికలపై నిఘా వేశాయి.