: పిస్టల్ తో వరల్డ్ కప్ సొంతం చేసుకున్న యువతి!
25 మీటర్ల పిస్టల్ విభాగంలో 23 ఏళ్ల యువతి చెలరేగిపోయింది. తూటాల్లాంటి విజయాన్ని సొంతం చేసుకుంది. దక్షిణ కొరియాలోని చాంగ్ వాన్ లోజరిగిన 25 మీటర్ల విభాగంలో మహారాష్ట్రకు చెందిన రాహి సర్నోబాత్ ప్రపంచకప్ ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. వరల్డ్ కప్ పిస్టల్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలు రాహి కావడం గమనార్హం. దక్షిణ కొరియాకు చెందిన క్యోంగే కిమ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రాహి తూటాలు గురి తప్పలేదు. ప్రతీసారి ఐదు షాట్లు చొప్పున ఏడు సిరీస్ లలో రాహి మూడు విజయాలు, రెండు ఓటములు, రెండు డ్రాలతో గెలుపు తన వశం చేసుకుంది. రాహి పుణెలోని గన్ ఫోర్ గ్లోరీ అకాడమీలో శిక్షణ తీసుకుంది.