: తెలంగాణ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన కేటీఆర్
తెలంగాణ పారిశ్రామికవేత్తల సమావేశానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... పరిశ్రమల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాదులో ఔటర్ రింగు రోడ్డు చుట్టూ రీజనల్ రింగు రోడ్డును ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పరిశ్రమలకు విద్యుత్, టాక్స్ కు సంబంధించి పలు అంశాలను టీ-పారిశ్రామికవేత్తలు ప్రస్తావించారు. త్వరలో పారిశ్రామికవేత్తలతో తమ అధినేత కేసీఆర్ కూడా సమావేశమవుతారని కేటీఆర్ చెప్పారు.