: ఉగ్రవాద కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోండి: షరీఫ్ కు మోడీ సూచన


భారత దేశానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ లో నడుపుతున్న ఉగ్రవాద కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు సూచించారని విదేశాంగ కార్యదర్శి సుజాత సింగ్ తెలిపారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, నవాజ్ షరీఫ్, నరేంద్ర మోడీ మధ్య జరిగిన చర్చలో, అంతకంతకు పెరుగుతున్న ఉగ్రవాదంపై మోడీ ఆందోళన వ్యక్తం చేశారని అన్నారు. 2008 ముంబై పేలుళ్ల సూత్రధారులపై విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News