: బెయిల్ కోసం వ్యక్తిగత బాండ్ ఇచ్చేందుకు కేజ్రీవాల్ అంగీకారం
ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పొందడానికి కోర్టుకు వ్యక్తిగత బాండ్ సమర్పించేందుకు అంగీకరించారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సూచనను స్వీకరిస్తున్నట్టు ఆయన న్యాయస్థానంకు తెలిపారు. బాండ్ సమర్పించిన వెంటనే కేజ్రీ జైలు నుంచి విడుదలవుతారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పరువునష్టం దావా కేసులో నాలుగు రోజుల కిందట ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.