: ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబుకి కరుణ అభినందనలు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబుకి డీఎంకే అధినేత ఎం.కరుణానిధి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన టీడీపీ అధినేతకు గురువారం లేఖ రాశారు. 'మీ తెలివైన ఎత్తుగడలు, కష్టపడేతత్వం, నిజాయతీతో పనిచేయడం ప్రజల హృదయాలకు ఎప్పుడూ దగ్గరయ్యేలా చేస్తాయి. మళ్లీ మీరు తిరిగి అధికారంలోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ నాయకత్వంలో సీమాంధ్ర శాంతితో బాటు, మంచి పాలనను పొందుతుందని నమ్మకంతో ఉన్నాం' అని కరుణ లేఖలో ఆకాంక్షించారు. తన పాత మిత్రుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు టైమ్ నుంచి బాబులో రాజకీయ ఎదుగుదలను చూస్తున్నానన్నారు.

  • Loading...

More Telugu News