: నవాజ్ షరీఫ్ తో ముగిసిన ప్రధాని మోడీ భేటీ
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. కాశ్మీర్ సహా పలు కీలక అంశాలపై ఇరు దేశాల ప్రధానులు చర్చించారు. ముంబై పేలుళ్లపై పాక్ విచారణ మందకొడిగా సాగుతున్నదని మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉగ్రవాద దాడులను నిరోధించాలని మోడీ నవాజ్ షరీఫ్ ను కోరారు.
'నరేంద్ర మోడీతో మీటింగ్ ఎక్స్ లెంట్' అని నవాజ్ షరీఫ్ అన్నారు. మోడీతో సమావేశం సత్ఫలితాలనిస్తుందని ఆశిస్తున్నానని షరీఫ్ అన్నారు.