: వేధింపుల ఆకతాయికి తగిన శాస్తి చేసిన యువతి


తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని వేధిస్తూ వెంటపడుతున్న ఆకతాయికి బంగ్లాదేశ్ మహిళ తగిన శాస్తి చేసింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా దగ్గర్లోని బలియాడండీ ఉపాజిలా గ్రామంలో ఖదీముల్ ఇస్లాం (28) చిరు వ్యాపారి. అదే గ్రామంలో ఉండే ఓ మహిళ వెంటపడి లైగింక సంబంధం పెట్టుకోవాలని ఇతగాడు ఇబ్బంది పెడుతున్నాడు. ఆమె అతనిని ఎంత తిరస్కరించినా వినకుండా, ఆమె కుటుంబ సభ్యులపై కూడా వేధింపులకు పాల్పడుతున్నాడు. దీనిని తట్టుకోలేని ఆమె అతనిని తన గదికి పిలిపించింది.

లైంగిక సంబంధానికి సై అంటోందని భావించిన అతను ఆమె గదికి వెళ్లడంతో తలుపులు మూసిన ఆమె అతడిపై యాసిడ్ పోసింది. ఈ యాసిడ్ దాడిలో అతడి శరీరం, పురుషాంగం కాలిపోయాయి. బాధ తట్టుకోలే విలవిల్లాడుతున్న అతని అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అతనిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆమె పోలీసులకు వాంగ్మూలమిచ్చింది.

  • Loading...

More Telugu News