: నవాజ్ షరీఫ్, అతని తల్లిని కదిలించిన మోడీ


తల్లికి బిడ్డ అంటే మమకారం... బిడ్డకి తల్లే అపురూపం...ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటారు పెద్దలు. నరేంద్ర మోడీ, అతని తల్లి హీరాబెన్ మధ్య అనురాగానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అతని తల్లి ముగ్ధులయ్యారు. నవాజ్ షరీఫ్ కు తల్లి అంటే విపరీతమైన ప్రేమ. ఎన్ని పనులున్నా వారానికోసారి తల్లిని చూడకపోతే మనసు ఊరుకోదు. అందుకే వారంలో కొంత సమయం తల్లి కోసం కేటాయిస్తుంటారు.

నరేంద్ర మోడీకి కూడా తల్లి అంటే అవ్యాజమైన ప్రేమ. ఈ నేపధ్యంలో క్రితంసారి షరీఫ్ తన తల్లి దగ్గరకు వెళ్లినప్పుడు టీవీలో సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా, నరేంద్ర మోడీకి అతని తల్లి మిఠాయిలు తినిపిస్తున్న దృశ్యాలు ప్రసారమవుతున్నాయి. వాటిని చూసిన నవాజ్ షరీఫ్, అతని తల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారట. ఆ అనుభవాన్ని మోడీని కలిసిన సందర్భంగా నవాజ్ షరీఫ్ పంచుకున్నారని మోడీ ట్విట్టర్లో తెలిపారు.

  • Loading...

More Telugu News