: కేజ్రీవాల్ కస్టడీ విషయంపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ
జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన కస్టడీ విషయమై ఢిల్లీ హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. కేజ్రీ దరఖాస్తును పరిశీలించిన ధర్మాసనం బెయిల్ బాండ్ చెల్లించి జైలు నుంచి బయటకు రావాలని సూచించింది. కేజ్రీ బయటకు వచ్చిన తర్వాత న్యాయ సందేహాలను లేవనెత్తవచ్చని ధర్మాసనం చెప్పింది. కోర్టు ఇచ్చిన సలహాను జైల్లో ఉన్న కేజ్రీవాల్ కు తెలిపేందుకు ఆయన తరపు న్యాయవాదులకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమయం ఇచ్చింది. తిరిగి మూడు గంటలకు న్యాయస్థానం ఈ విషయంపై విచారణ చేపట్టనుంది.