: మోడీకి అభినందనలు తెలిపిన చైనా పత్రిక


భారత్, చైనా దేశాలు శత్రువుల్లా ఉండాల్సిన అవసరం లేదని, అభివృద్ధి కోసం కలసి పనిచేయాలని చైనా ప్రముఖ పత్రిక చైనా డైలీ సూచించింది. భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టిన మోడీకి అభినందనలు తెలియజేస్తూ ఆ పత్రిక సంపాదకీయాన్ని రాసింది. అభివృద్ధి చెందుతున్న దేశాలుగా కలసి మెలసి పనిచేయాలని పిలుపునిచ్చింది. దశాబ్దాలుగా ఎన్నో వైరుధ్యాలు, విభేదాలను పరిష్కరించుకోవడాన్ని గుర్తు చేసింది. సంస్కరణల వాది అయిన భారత ప్రధాని మోడీకి, భారత ప్రజలకు అభినందనలు తెలియజేసింది. మోడీ భారత్ ను ప్రపంచంలో రెండో శక్తిమంతమైన దేశంగా నిలబెడతారని ఆశాభావం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News