: మోడీ నిత్యం ప్రజల గురించే ఆలోచిస్తారు: అశోక్ గజపతిరాజు
దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిత్యం ప్రజల గురించే ఆలోచిస్తారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ మౌలిక వసతులు ఉన్నాయన్న ఆయన, రెండు రాష్ట్రాల్లో లెక్కకు మిక్కిలి సమస్యలు ఉన్నాయన్నారు. సమస్యలను పరిష్కరించి అభివృద్ధి దిశగా రాష్ట్రాలను నడిపించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.