: క్షీణించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆరోగ్యం!
కరెంట్ కోతలు, విద్యుత్ ఛార్జీల పెంపుపై హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరాహార దీక్ష ఐదవరోజుకు చేరింది. దీక్ష చేస్తున్న పార్టీ ఎమ్మెల్యేల ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఈ నేపథ్యంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో పాటు మిగతా నేతలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
విజయమ్మ, శోభానాగిరెడ్డితో బాటు పలువురి షుగర్ లెవల్స్ పడిపోయాయని చెప్పారు. ఐదురోజుల నుంచి తాము దీక్ష చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం సరైంది కాదని ఎమ్మల్యేలు మండిపడుతున్నారు. మరోవైపు దీక్షా శిబిరంలో పోలీసులు భారీగా మోహరించడంతో ప్రభుత్వం దీక్షను భగ్నం చేస్తుందని సమాచారం.