: ఒకవైపు మోడీ ప్రమాణం... మరోవైపు పాక్ కాల్పులు


సమయం సోమవారం సాయంత్రం 6.11 గంటలు. మోడీ ప్రమాణ స్వీకారం ముగిసింది. తర్వాత కేబినెట్ మంత్రులు ప్రమాణం చేస్తున్నారు. అతిథుల్లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా ఉన్నారు. 6.15గంటలు అవుతోంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని సరిహద్దుల్లో పాక్ వైపు నుంచి కాల్పులు జరిగాయి. అంతకు ముందు ఉదయం 11.20 సమయంలోనూ పూంచ్ లోని నాగి టెక్రి వద్ద కూడా నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనికులు 15 నిమిషాల పాటు కాల్పులు జరిపారు. భారత్ కు శాంతి సందేశంతో వచ్చానని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించగా, ఆ దేశ సైన్యం అందుకు విరుద్ధంగా కాల్పులకు దిగి తన నైజాన్ని చాటుకుంది.

  • Loading...

More Telugu News