: 24కు చేరుకున్న రైలు ప్రమాద మృతుల సంఖ్య
ఉత్తర ప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ స్టేషన్ వద్ద నిన్న జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 24కు చేరుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే 100 మంది వరకు గాయపడినట్లు తెలిపారు. నిన్న ఉదయం ఢిల్లీ నుంచి గోరఖ్ పూర్ వెళుతున్న గోరఖ్ ధామ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి పక్క లైన్లో ఉన్నగూడ్స్ రైలును ఢీకొట్టడంతో... ఆరు బోగీలు భారీగా ధ్వంసమయిన విషయం తెలిసిందే.