: యూపీ రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రధాని నష్టపరిహారం
ఉత్తరప్రదేశ్ లో నిన్న (సోమవారం) సంత్ కబీర్ నగర్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల నష్ట పరిహారాన్ని ప్రధానమంత్రి జాతీయ నిధి నుంచి నరేంద్ర మోడీ ప్రకటించారు. అంతేగాక తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారికి రూ.50,000 ఇస్తున్నట్లు తెలిపారు. ఈ దారుణ ప్రమాదంలో దాదాపు 20మందికి పైగా మరణించగా, యాభై మందికి గాయాలయ్యాయి.