: సుస్థిరమైన ప్రభుత్వాన్ని, సుపరిపాలనను అందిస్తా: నరేంద్ర మోడీ
ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ అంతకు కొద్ది సమయం ముందు తన అధికారిక వెబ్ సైట్ ద్వారా దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. మార్పును ఆశించి తనకు పట్టం కట్టిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వారు కోరుకున్న సుస్థిరమైన ప్రభుత్వాన్ని, సుపరిపాలనను అందిస్తానని మోడీ హామీనిచ్చారు. ప్రజలకు, తనకు మధ్య ఈ వెబ్ సైట్ మంచి మాధ్యమంగా పనిచేస్తుందని భావిస్తున్నానన్నారు. దీని ద్వారా తన కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు.