: మోడీ టీమ్ లోని మరికొందరు మంత్రులు


నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆమె ఇంతకుముందు జాతీయ మహిళా కమిషన్ మాజీ సభ్యురాలుగా కూడా ఉన్నారు.
గౌడర్ మల్లికార్జునప్ప సిద్ధేశ్వర కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వరుసగా మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు.
మనోజ్ సిన్హా కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సిన్హా మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు.
నేహాల్ చంద్, ఉపేంద్ర కుష్వాహా, సి.వి. రాధాకృష్ణన్, కిరెన్ రిజిజు, క్రిషన్ పాల్ గుజర్, సంజీవ్ కుమార్, మన్సుక్ భాయ్, ధనాజీభాయ్, రావు సాహెబ్ దాదారావ్ పటేల్ ధాన్వే, విష్ణుదేవ్ సాయి, సుదర్శన్ భగత్ కేంద్ర సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

  • Loading...

More Telugu News