: అవునా.. ఏలియన్స్‌ నిజమేనా?


ఏలియన్స్‌ (గ్రహాంతర జీవులు) ఉన్నారని, ఫ్లయింగ్‌ సాసర్‌ను చూశామని ఎవరైనా అంటే గనుక మనం ముందుగా చిన్నపిల్లల మాట కింద కొట్టిపారేస్తాం. అదే అమెరికాలో అయితే కొంచెం సీరియస్‌గా పరిగణించే ఛాన్సుంది. ఈ తేడా ఎందుకంటే మన వాతావరణంలో ఏలియన్స్‌కు సంబంధించిన ప్రచారాలన్నీ పిల్లల సినిమాల రూపంలో మాత్రమే వచ్చాయి. అదే అమెరికా కల్చర్‌లో ఏలియన్స్‌కు సంబంధించిన సినిమాలు.. పెద్దవాళ్లకు సంబంధించిన మానవాళికి ప్రమాదకరంగా పరిణమించిన రూపంలో వచ్చాయి.. కనుక ఆయా సినిమాలు కలిగించే ప్రభావం ప్రకారం మనలో అలాంటి అభిప్రాయాలు ఉన్నాయి.

మనలాంటి మామూలు వ్యక్తులు చెప్పే ఏలియన్స్‌ మాటల కేంగానీ.. వ్యోమగామి సునీతా విలియమ్స్‌ కూడా ఏలియన్స్‌ ఉండవచ్చుననే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. భూమిపై మాత్రమే జీవం ఉన్నట్లు మనం అనుకోకూడదు. పలు గ్రహాలపై జీవంకు సరిపడే వాతావరణం ఉన్నట్లు తేలుతున్నందున.. జీవం ఉండే అవకాశం కూడా ఉండొచ్చు అని ఆమె అంటోంది. అంటే ఏలియన్స్‌ కథలన్నీ నిజం అయ్యే చాన్సుందన్నమాట.

  • Loading...

More Telugu News