: మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి తరలివచ్చిన ప్రముఖులు


ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. మొత్తం 4 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారిలో మన రాష్ట్రం నుంచి గవర్నర్ నరసింహన్, వెంకయ్యనాయుడు, చంద్రబాబు, బాలకృష్ణ, కేసీఆర్, పళ్లంరాజు, అశోక గజపతిరాజు, రామోజీరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎనిమిది దేశాధిపతులు ఢిల్లీకి వచ్చిన విషయం విదితమే. బీజేపీ అగ్రనేత అద్వానీ, ఆ పార్టీ అధినేత రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని దేవెగౌడ, వీహెచ్ పీ నేత ప్రవీణ్ తొగాడియా, ధర్మేంద్ర, హేమమాలిని, శత్రుఘ్న సిన్హా, వినోద్ ఖన్నా, సల్మాన్ ఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News