: గోరఖ్ పూర్ రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.లక్ష నష్ట పరిహారం
గోరఖ్ పూర్ సమీపంలో ఇవాళ ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 40కి పెరిగింది. మరో 100 మందికి గాయపడ్డారు. ఢిల్లీ నుంచి గోరఖ్ పూర్ వెళ్తున్న గోరఖ్ ధామ్ ఎక్స్ ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రైలులోని ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం వద్ద రైల్వే అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల నష్ట పరిహారాన్ని రైల్వే శాఖ ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నారు.