: భారతీయుడు దేశాన్ని పాలిస్తున్నాడన్న భావన కలుగుతోంది: పయ్యావుల
భారతీయుడు భారతదేశాన్ని పాలిస్తున్నాడన్న భావన కలుగుతోందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రధాని భారతీయుడే అయినా విదేశీ వనిత దేశాన్ని పాలిస్తుందనే భావన తనలో నెలకొందని అన్నారు. ఇప్పుడు భారతీయుడే దేశాన్ని నడిపిస్తాడనే తృప్తి నెలకొందని ఆయన అన్నారు. మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి ఏం చేయాలి, ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కసితో ఉన్నామని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ను టీడీపీ అభివృద్ధి పథాన నడుపుతుందని ఆయన స్పష్టం చేశారు. టీడీపీలో ఎవరికీ పదవీకాంక్ష లేదని పయ్యావుల తెలిపారు.