: ఆక్సిజన్ లేకపోయినా పర్లేదు... అధికారం లేకుండా ఉండలేకపోతున్నారు: రఘువీరా
కొందరు రాజకీయ నాయకులు ఆక్సిజన్ లేకుండా ఉండగలరేమో కానీ, అధికారం లేకుండా మాత్రం ఉండలేకపోతున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నేతలు పార్టీలు ఫిరాయించడం ముమ్మాటికీ అనైతికమేనని అన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.