: గ్రహాలన్నీ చుట్టేసే రాకెట్లు వచ్చేస్తాయ్


ఇప్పుడు రోదసిలో ప్రయాణించే రాకెట్లకు ఇంధనం అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.. పైగా ఆ ప్రయాణంలో చాలా జాప్యం కూడా ఉంటుంది. ఉదాహరణకు అంగారక గ్రహంపైకి రాకెట్‌ చేరాలంటే.. నాలుగు సంవత్సరాల సమయం పడుతుందని.. శాస్త్రవేత్తల అంచనా. అయితే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా రాకెట్‌లకు మరొక ఇంధనం తయారుచేయడం ద్వారా.. సులభంగా, చవగ్గా, మరింత వేగంగా నడిచేలా ఓ టెక్నాలజీని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ప్రకారం ఒక నెల రోజుల్లో అంగారకుడిని చేరుకోవచ్చు.

ఈ సాంకేతికతకు సంబంధించిన విడిభాగాలపై జరిపిన ప్రయోగాలు కూడా సక్సెస్‌ అయ్యాయి. సూర్యుడు ఇతర నక్షత్రాల్లో శక్తిని పుట్టించే కేంద్రక సంలీన ప్రక్రియను రాకెట్‌ నడిపించే చోదక శక్తిగా వాడాలనేదే ఈ సాంకేతికతలో కీలకాంశం.

ఈ వివరాలను శాస్త్రవేత్త జాన్‌స్లాగ్‌ వెల్లడించారు. ఈ ప్రయోగాలన్నీ మరింత మంచి ఫలితాలనిస్తే గనుక.. భవిష్యత్తులో ఒకగ్రహం మీదనుంచి మరో గ్రహానికి రెగ్యులర్‌గా రాకపోకలు సాగిస్తూ ఉండే రాకెట్‌లను నిర్మించవచ్చునని కూడా భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News