: నవ తెలంగాణ కోసం ఒక్క రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చిన జైళ్ల శాఖ
నవ తెలంగాణ నిర్మాణానికి జైళ్ల శాఖ ఉద్యోగులు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. తెలంగాణ ప్రిజనర్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు తమ ఒక రోజు వేతనాన్ని తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ... రెండు వేల మంది ఉద్యోగులు జూన్ నెలలో ఒక రోజు వేతనం మొత్తం సుమారు రూ.30 లక్షల రూపాయలను విరాళంగా అందించామని చెప్పారు.