: రక్షణశాఖ బాధ్యతలు కూడా అరుణ్ జైట్లీకే!
నరేంద్రమోడీ క్యాబినెట్ లో బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీకి మరో అదనపు బాధ్యత కట్టబెట్టనున్నారు. మంత్రివర్గ కూర్పులో భాగంగా మొదట ఆయనకు ఆర్థిక శాఖను కేటాయించారు. ఇప్పుడు దేశ రక్షణ శాఖ బాధ్యతలను కూడా జైట్లీకే అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, తొలుత రక్షణ శాఖను మోడీ తనవద్దే పెట్టుకుంటున్నారని వార్తలు వచ్చాయి.