: నేటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ట్రయల్ రన్!
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రయోగాత్మకంగా పనిచేయనున్నాయి. జూన్ 2 నుంచి ప్రస్తుతమున్న ఆంధప్రదేశ్ అధికారికంగా విడిపోతున్న సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వేటికవే పాలన సాగించాల్సి ఉంటుంది. అందుకు ముందస్తు సన్నాహకంగా నేటి నుంచే విడివిడిగా అధికారులు పాలన ప్రారంభించనున్నారు.
జూన్ 2లోపు ఏవైనా ఇబ్బందులు వస్తే వాటిని తొలగించుకుని పూర్తి స్థాయి పాలనకు సిద్ధం కావడం కోసం ఇలా చేస్తున్నారు. ఈ సమయంలో ఎలాంటి అధికారిక నిర్ణయాలు తీసుకోరు. ఈ రోజు నుంచి జూన్ 1 వరకు సచివాలయంలో అన్ని రకాల నిర్ణయాలు, లావాదేవీలను నిలిపివేస్తూ గవర్నర్ నరసింహన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో మిగిలిన విభజన పనులు ఏవైనా ఉంటే వాటిని కూడా పూర్తి చేసి, రెండు రాష్ట్రాలను నూతన పాలనకు సిద్ధం చేయనున్నారు.